రాజీనామా ప్రకటించిన జె.సి.దివాకరరెడ్డి!

వరసగా ఆరు సార్లు ఎం.యల్.ఏ గా గెలిచిన,సీనియర్ రాజకీయ నాయకులు,ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి,అనంతపురం జిల్లా లో ఎదురు లేని రాజకీయ శక్తి గా ఆవిర్భవించిన ప్రస్తృత అనంతపూర్ టీడీపీ ఎం.పి జె.సి.దివాకర్ రెడ్డి రాజీనామా చేయనున్నారు.ఆయన గత కొంత కాలంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్తూ వస్తున్నారు.వయసు కారణం తో రాజీనామా చేస్తున్నట్లు చెప్తునప్పటికి ప్రభాకర్ చౌదరీ కి జె.సి కి ఉన్న గొడవల వల్లే అని తెలుస్తుంది.ముఖ్యమంత్రి ఎంతసేపటికి ప్రభాకర్ కి మద్దతు ఇస్తూ దివాకర్ మాట జిల్లా లో తగిస్తున్నారు అని అందుకే రాజీనామా చేయన్నున్నారు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.అయితే ఆయన కుమారుడు జె.సి.పవన్ రెడ్డి,ఈ మధ్య తరచు జిల్లా లో తిరుగుతూ ఉండడం,కార్యకర్తలతో భేటీ అవడం చూస్తుండే రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారు అని అర్థం అవుతుంది.నా కొడుకు పొట్టి చేస్తారు అని దివాకర్ రెడ్డి కూడా చెప్తున్నారు,కానీ ఏ పార్టీ అన్నది చెప్పడం లేదు.నిన్నటి దాకా తిట్టిన జగన్ దగ్గరకు వెళ్తారా?లేక సినీ రంగం కనుక జనసేనని తో కలుస్తారా?లేక రెండు జాతీయ పార్టీలలో ఏదైనా పార్టీ లో చేరుతారో అనేది వేచి చూడాలి!